NTR Coin కోసం భారీ క్యూ..!

దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు శ‌త జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయన ఫోటో ముద్ర‌ణతో రూ.100 కాయిన్ (ntr coin) రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అది 100 కాయిన్ అయిన‌ప్ప‌టికీ దాని ధ‌ర రూ.4000 వ‌ర‌కు ఉంద‌ట‌. ఇప్ప‌టికే ఆన్‌లైన్‌లో అన్నీ అమ్ముడుపోయి స్టాక్ కూడా అయిపోయాయి. అయితే సైఫాబాద్‌లో ఈ కాయిన్ అమ్ముతున్నార‌ని తెలిసి అన్న‌గారి అభిమానులు ఆ కాయిన్ కోసం క్యూ క‌ట్టారు. ఆ కాయిన్ ద‌గ్గ‌ర ఉంటే అయినా అన్న‌గారి ఆశీస్సులు త‌మ‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటాయ‌ని వారు భావిస్తున్నారు. కాయిన్ తీసుకునేముందు చెప్పులు విడిచి, కళ్ళకి అద్దుకొని తీసుకోవాలని అక్కడ ఉన్న వారు స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. (ntr coin)