Roja: మొర‌గ‌ని కుక్క లేదు.. విమ‌ర్శించ‌ని నోరు లేదు..!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) వాడిన మొర‌గ‌ని కుక్క లేదు.. విమ‌ర్శించ‌ని నోరు లేదు.. అనే డైలాగ్‌ను YSRCP నేత రోజా (roja) వాడారు. ఈరోజు న‌గ‌రిలో జ‌గ‌న‌న్న విద్యాదీవెన కార్య‌క్ర‌మం నిర్వ‌హించిన సంద‌ర్భంగా రోజా మాట్లాడారు. “” చంద్ర‌బాబు నాయుడు, ప‌వన్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ అన్న‌పై చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే.. జైల‌ర్‌లో రజినీకాంత్ చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తోంది. మొర‌గ‌ని కుక్క‌ లేదు.. విమ‌ర్శించ‌ని నోరు లేదు.. ఈరెండూ ఉండ‌ని ఊరూ లేదు. జ‌గ‌న్ అన్న‌ని ఆడిస్తాం.. జ‌గ‌న్ అన్న‌ని ఆడుకుంటాం అంటూ కామెంట్స్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టివ‌ర‌కు ఎమ్మెల్యేగా కూడా గెల‌వ‌లేదు. ఇంకేంటి ఆయ‌న ఆడించ‌లేదు. జ‌గ‌న్ అన్న‌ను ఆడించాల‌న్నా, ఓడించాల‌న్నా అవ‌తలి వైపు కూడా జ‌గ‌న్ అన్నే ఉండాలి. ఎందుకంటే ఆయ‌న్ని ఓడించేవాడు ఇంకా పుట్ట‌లేదు “” అంటూ సినిమా రేంజ్‌లో ఎలివేష‌న్ ఇచ్చారు రోజా. (roja)

ఇక్క‌డ రోజా గుర్తుపెట్టుకోవాల్సిన విష‌యం ఏంటంటే.. ర‌జినీకాంత్ అన్న‌ది కూడా YSRCP నేత‌ల‌నే. ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు నాయుడిని పొగిడార‌న్న అక్క‌సుతో కొడాలి నాని, గుడివాడ అమ‌ర్నాథ్‌లు క‌లిసి ర‌జినీకాంత్‌ను ముస‌లోడు.. చీకేసిన వాడిలా ఉంటాడు అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు వాగారు. వారికి పంచ్ వేస్తూనే ర‌జినీ మొర‌గ‌ని కుక్క లేదు అనే డైలాగ్ వేసారు అన్న విష‌యం వారు మ‌ర్చిపోయిన‌ట్లున్నారు.