Jagan: చంద్రబాబుకి కొడుకుపై నమ్మకంలేదు
TDP అధినేత చంద్రబాబు నాయుడికి (chandrababu naidu) సొంత కొడుకుపై నమ్మకం లేకనే పవన్ కళ్యాణ్‌ను (pawan kalyan) నమ్ముకున్నారంటూ ఆరోపించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan). చిత్తూరులోని నగరిలో (nagari) ఏర్పాటుచేసిన జగనన్న విద్యా దీవెన ప్రోగ్రామ్‌లో భాగంగా జగన్ మాట్లాడుతూ.. మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పథకం అయినా ప్రలకు గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. పార్టీలోకి చేర్చుకున్న సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నారా లోకేష్‌పైనే నమ్మకం లేదని అన్నారు.
“” అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటాడు. చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడు మీటింగ్స్ పెడితే రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తారే తప్ప ఒక్క మంచి మాట ఉండదు. పుంగనూరులో పోలీసుల మీద చంద్రబాబు కార్యకర్తల చేత రాళ్లు రువ్వించారు. పాపం పోలీసులు చేసిన తప్పేంటంటే.. చంద్రబాబు గారూ.. మీకు అనుమతి ఇచ్చిన రూట్లోనే వెళ్లండి అని చెప్పడం. రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసాడు. అంతేకాకుండా వారి తరఫున ఇస్తానని సున్నా వడ్డీలను కూడా ఎగ్గొట్టాడు. ప్రతి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి మోసం చేసాడు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. జాబు రాకపోతే నిరుద్యోగభృతి ఇస్తానన్నారు. ఎంత వరకు ఆయన ఇవన్నీ నెరవేర్చాడో ఆయనకే తెలియాలి. ఎన్నికలకు ముందు ఆయన మేనిఫెస్టో చెత్తబుట్టలో ఉంటుంది. ఆయనకు సంబంధించిన వెబ్‌సైట్స్‌లో కూడా ఆ మేనిఫెస్టో ఉండదు “” అంటూ విమర్శలు చేసారు జగన్. (jagan)