Chiranjeevi: ఫైనల్లీ రీమేక్‌లకు నో చెప్పేసిన మెగాస్టార్
భోళా శంకర్ (bhola shankar) డిజాస్టర్ తర్వాత ఫ్యాన్స్ తన నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారో ఇప్పటికి తెలుసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi). నిజానికి ఆరు పదుల వయసులో ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తున్నారంటే.. అది ఫ్యాన్స్ కోసం.. ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోలకు స్ఫూర్తిగా ఉండటం కోసం. ఈ వయసులోనూ ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ డ్యాన్స్‌లో అదే స్టైల్. ఆయన జనాలను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీగా ఉంటే.. రోత స్క్రిప్ట్‌లు, రీమేక్‌లతో వెళ్లి ఆయనకు ఏదో ఒక సోది చెప్పి ఒప్పించేస్తున్నారు. భోళా శంకర్ అలా తీసిన సినిమానే.
తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదని.. పైగా OTTలో కూడా లేదని జనాలు చూసి ఉండరని చెప్పి ఆయన్ను సినిమాకు ఒప్పించారు. కానీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు చిరంజీవి ఆచి తూచి స్క్రిప్ట్ సెలెక్షన్ చేస్తున్నారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తీసిన బ్రో డ్యాడీని తెలుగులో రీమేక్ చేయాలన్న ఉద్దేశంతో ఓ డైరెక్టర్ ఇటీవల చిరుని కలిసారట. అది రీమేక్ అని తెలిసి వెంటనే చిరు నో చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు చిరుతో యూవీ క్రియేషన్స్ ఓ సోషియో ఫ్యాంటసీ సినిమా చేస్తోంది. దీనికి వశిష్ఠ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. (chiranjeevi)