Anil Sunkara: నిర్మాత‌గా వ‌రస ఫ్లాప్స్.. ఇక డైరెక్ట‌ర్‌గా..!

రెండు సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ దెబ్బ‌తిన్నారు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌ (anil sunkara) . దాంతో కొన్ని నెల‌ల పాటు ఎలాంటి ఇత‌ర డైరెక్ట‌ర్లు తీసే సినిమాల‌ను నిర్మించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నారు. తానే ఓ మంచి సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట. ఇందుకోసం త‌న టీంను ఒక మంచి స్క్రిప్ట్ రెడీ చేయాల‌ని చెప్పార‌ట‌. గ‌తంలో అల్ల‌రి న‌రేష్‌తో (allari naresh) యాక్ష‌న్ 3D అనే సినిమా తీసారు అనిల్ సుంక‌ర. కానీ అది బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్ అయింది. ఈసారి ప‌క్కా ప్లానింగ్‌తో తానే ఓ మంచి సినిమా తీసి ఏజెంట్ (agent), భోళా శంక‌ర్ (bhola shankar) ఫ్లాప్స్ వ‌ల్ల న‌ష్ట‌పోయిన డ‌బ్బును మ‌ళ్లీ సంపాదించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ఏజెంట్, భోళా శంక‌ర్ సినిమాల కార‌ణంగా అనిల్ దాదాపు రూ.80 కోట్లు న‌ష్ట‌పోయార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇప్పుడు సినిమాల కోసం ఆయన తీసుకున్న లోన్స్ అన్నీ క్లియ‌ర్ చేయ‌డానికి ఒక మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డాల్సిందే. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (ak entertainments) బ్యాన‌ర్‌పై ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 10 సినిమాలు తీసారు అనిల్ సుంక‌ర‌. ఏజెంట్ త‌ర్వాత మ‌ధ్య‌లో వ‌చ్చిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌తో రూ.22 కోట్ల వ‌ర‌కు లాభ‌ప‌డ్డారు అనిల్. ఆ త‌ర్వాత వ‌చ్చిన భోళా శంక‌ర్‌తో మ‌ళ్లీ బోల్తాప‌డ్డారు. (anil sunkara)