Chandrayaan: చంద్రుడికి హిందూ రాష్ట్రం అని పేరు పెట్టాలి
ఇస్రో (isro) చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ 3 (chandrayaan) మిషన్లో భాగంగా.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) శివ శక్తి పాయింట్ (shiv shakti point) అని పేరు పెట్టడంతో రచ్చ జరుగుతోంది. శివ శక్తి అని మాత్రమే ఎందుకు పెట్టాలి జవహర్ పాయింట్ అని ఎందుకు పెట్టకూడదు అని ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఓ పక్క ఈ చర్చ జరుగుతుంటే.. చంద్రుడికి హిందూ రాష్ట్రం అని పేరు పెట్టాలి అంటూ ఓ స్వామీజీ. ఆల్ ఇండియా హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామీ చక్రపాణి మహరాజ్ (swamy chakrapani maharaj) ఈ వ్యాఖ్యలు చేసారు. ఇతర మతాల వారు చంద్రుడిని ఆక్రమించుకునేలోపు హిందూ రాష్ట్రంగా పేరు మార్చేయాలని.. ఇందుకోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. (chandrayaan)
“” చంద్రుడిని హిందూ రాష్ట్రమని.. చంద్రయాన్ ల్యాండ్ అయిన ప్రదేశాన్ని దాని రాజధానిని చేసేయాలి. ఏ ఉన్మాది, ఇతర మతాల వారు చంద్రుడిని ఆక్రమించుకోకముందే.. ఈ పేర్లు పెట్టేయాలి. ఇందుకోసం త్వరగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే మంచిది “” అంటూ వింత వ్యాఖ్యలు చేసారు. ఈయనగారు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి వైరల్ అవడం ఇదేం కొత్త కాదు. గతంలో ప్రపంచం కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలం అవుతుంటే.. ఈ స్వామీజీ గోమూత్ర పార్టీని నిర్వహించారు. ఆల్ ఇండియా మహా సభ సభ్యలను పిలిపించి గోమూత్రాన్ని తాగించారు. భారతదేశంలోని ఆవుల్లోనే దేవుడు ఉంటాడు కాబట్టి.. ఇతర దేశాల వారు కూడా ఇక్కడి నుంచే గోమూత్రాన్ని ఎగుమతి చేసుకుంటున్నారు అని వాగాడు.