UFC Star: నా భార్యను చీట్ చేసే హక్కు నాకుంది
అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్‌లో (ufc star) పాల్గొన్న షాన్ ఓమాల్లే.. (sean o’malley)నిన్న జరిగిన బ్యాంటమ్ వెయిట్ టైటిల్ ఛాంపియన్‌షిప్‌లో తన ప్రత్యర్థి ఆల్జమిన్ స్టెర్లింగ్‌పై గెలిచాడు. అయితే ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ముందు షాన్ ఓ టాక్ షోలో పాల్గొన్నాడు. అయితే షాన్ తన భార్య డాన్యాను చీట్ చేస్తున్నాడంటూ కొంతకాలంగా తన గురించి వస్తున్న వార్తలపై షాన్ స్పందించాడు. అతని స్పందన విన్నాక మీడియాకు దిమ్మతిరిగిపోయింది. తన దగ్గర ఉన్న డబ్బుతో తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నానని.. అలాంటప్పుడు తన భార్యపై చీట్ చేసే హక్కు తనకు ఉంటుందని అంటున్నారు. ఇంత సక్సెస్ అయినప్పుడు ఇలా ఇతర అమ్మాయిలతో సెక్స్ చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నాడు. దాంతో ఇతను ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన దానికంటే.. ఇతను చేసిన కామెంట్స్‌కే ఎక్కువ వైరల్ అవుతున్నాడు. (ufc star)