Anupam Kher: బెస్ట్ యాక్టర్.. నాకు ఇచ్చి ఉంటే బాగుండు
69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో (national film awards) భాగంగా 68 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ.. బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun). సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప సినిమాలో బన్నీ యాక్టింగ్‌కి గానూ ఈ అవార్డు వరించింది. 68 ఏళ్లలో ఒక్కసారి కూడా తెలుగు నటుడికి బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదు. ఆ ఘనత సాధించిన ఏకైక తెలుగు నటుడు మన పుష్పరాజ్.
అయితే బన్నీకి బెస్ట్ యాక్టర్ రావడంపై నటుడు అనుపమ్ ఖేర్ (anupam kher) కాస్త హర్ట్ అయినట్లున్నారు. బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో అనుపమ్ ఖేర్ నటించిన కశ్మీర్ ఫైల్స్ సినిమాకు నర్గిస్ దత్ అవార్డు వచ్చింది. దీని గురించి అనుపమ్ ట్వీట్ చేస్తూ.. “” కశ్మీర్ ఫైల్స్‌కి నర్గిస్ దత్ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా నటనకు గానూ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చి ఉంటే బాగుండు. అయినా జీవితంలో కోరుకున్నవి అన్నీ దొరికేస్తే ఇక సాధించాల్సింది ఏమీ ఉండదు. జాతీయ అవార్డులు గెలుచుకున్న అందరికీ అభినందనలు “” అని ట్వీట్ చేసారు. అంటే బెస్ట్ యాక్టర్ బన్నీకి కాకుండా తనకు వచ్చి ఉంటే బాగుండు అని అనుపమ్ ఇన్‌డైరెక్ట్‌గా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. (anupam kher)