Brics Summit: మోదీని కలిసామంటూ చైనా అబద్ధాలు
బ్రిక్స్ సమిట్‌లో (brics summit) భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) వివిధ దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మీటింగ్‌లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ని (jinping) కూడా కలవనున్నారని సమాచారం. అయితే మోదీ సౌత్ ఆఫ్రికాకు వచ్చినప్పుడే జిన్‌పింగ్ ఆయన్ను కలిసాడని చైనా వెల్లడించింది. “” జిన్‌పింగ్ రిక్వెస్ట్ మేరకు ఆగస్ట్ 23న మోదీ ఆయన్ను కలిసారు. వీరిద్దరూ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద (లడక్ గాల్వాన్ వ్యాలీ) 2020 జూన్ నుంచి చైనా, భారత్ సరిహద్దు దళాల మధ్య జరుగుతున్న ఘర్షణలను ఎలాగైనా ఆపాలని చర్యలు తీసుకునేలా చర్చలు జరిపారు “” అని చైనీస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే అందులో ఏమాత్రం నిజంలేదని.. జిన్‌పింగ్ మోదీ కలవాలనుకుంటున్నారని చైనా నుంచి రిక్వెస్ట్ మాత్రమే వచ్చిందని తెలిపింది. కాకపోతే జొహానెస్బర్గ్లో మీటింగ్ జరిగినప్పుడు మోదీ జిన్‌పింగ్ అనధికారికంగా మాట్లాడుకున్నారని ఇండియా వెల్లడించింది. సౌత్ ఆఫ్రికాలో పర్యటన ముగిసిన తర్వాత మోదీ గ్రీస్ (greece) వెళ్లారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. (brics summit)