Allu Arjun: పార్టీ లేదా పుష్పా…?!

టాలీవుడ్ 68 ఏళ్ల క‌ల నెర‌వేరింది. 68 ఏళ్లుగా జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాలు (national film awards) జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు తెలుగు వారికి బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు రాలేదు. కానీ ఈ 69వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాలతో ఆ లోటు తీరిపోయింది. మ‌న స్టైలిష్ స్టార్ మ‌న బ‌న్నీ అల్లు అర్జున్ (allu arjun) ఆ అవార్డును కొట్టేసారు. పుష్ప (pushpa 1) సినిమాకు గానూ బ‌న్నీ ఈ అవార్డును అందుకున్నారు. దాంతో ఫ్యాన్స్ అంతా పార్టీ లేదా పుష్పా అంటూ అల్లు అర్జున్‌కి కంగ్రాట్స్ చెప్తున్నారు. పుష్ప‌కు ముందు వ‌ర‌కు బ‌న్నీ చేసిన సినిమాలు వేరు ఈ సినిమా వేరు. ఈ సినిమాలో అస‌లు బ‌న్నీని ఎప్పుడూ చూడ‌ని లుక్‌లో చూపించి ఫ్యాన్స్‌ని మెస్మరైజ్ చేసారు డైరెక్ట‌ర్ సుకుమార్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆయ‌న స్టార్‌డం అంత‌ర్జాతీయంగానూ పాకింది. ఇక పుష్ప‌- ది రూల్ సినిమ‌తో బ‌న్నీ ఇంకెన్ని రికార్డులు బ‌ద్ద‌లుకొడ‌తాడో చూడాలి. (allu arjun)