Chandrayaan 4: జపాన్‌తో కలిసి మిషన్ లూపెక్స్..!
చంద్రయాన్-3తో (chandrayaan 3) చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది భారత్. ఇప్పుడు భారత్‌ని చూసి మిగతా దేశాలు జాబిల్లి దక్షిణ ధృవం వైపు కాలుమోపాలని క్యూ కడుతున్నాయి. చంద్రయాన్-3 సక్సెస్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాన్- 4 (chandrayaan 4) గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. చంద్రయాన్ -4 కోసం జపాన్‌తో (japan) కలిసి పనిచేయబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ISRO (ఇండయన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్), JAXA (జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ) కలిసి పనిచేయనున్నాయి. ఈ మిషన్‌కు లూపెక్స్ (lupex) అని పేరుపెట్టారు.
మిషన్ లూపెక్స్ (chandrayaan 4) ద్వారా చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు నీటి వనరులు ఉన్నాయా లేదా అనే దానిపై మరింత లోతుగా పరిశోధనలు చేయబోతున్నారట. ఎన్నో ప్రశ్నలకు ఈ మిషన్ లూపెక్స్ సమాధానం ఇస్తుందని తెలిపారు. ఈ మిషన్ ద్వారా జాబిల్లిపై ఉన్న నీటి వనరుల క్వాలిటీ, క్వాంటిటీని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం.. చంద్రుడిపై ఉన్న నీటి వనరుల కచ్చితంగా ఎంత క్వాంటిటీలో ఉన్నాయో లూపెక్స్ మిషన్‌లో కనుగొననున్నారు. దానిని బట్టి భూమి నుంచి ఎంత శాతం నీరు జాబిల్లి మీదకు ట్రాన్స్పోర్ట్ చేయగలం అనే అంచనాలకు వస్తారు. ఇక్కడి నీరు అక్కడికి తీసుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని చంద్రయాన్ మిషన్లు చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇక నాణ్యత విషయాలకు వస్తే..జాబిల్లిపై ఉన్న నీటి వనరులు ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎంత వరకు విస్తరింపబడి ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇందుకోసం లూపెక్స్లో అత్యంత పల్చని ఫిల్మ్ సోలార్ సెల్స్, అధిక డెన్సీటి బ్యాటరీలు అమర్చనున్నారు. జాబిల్లిపై ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా తట్టుకునే శక్తి లూపెక్స్కి ఉండేలా డిజైన్ చేయనున్నారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ చంద్రుడిపైనే కాకుండా మార్స్, ఇతర గ్రహాలకు సంబంధించిన మిషన్లు కూడా చేపట్టేందుకు ఉపయోగపడుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ లూపెక్స్ మిషన్ 2026లో లాంచ్ అవుతుంది. (chandrayaan 4)