Varun Lavanya Marriage: 50 మంది అతిథుల‌తో.. ఆరోజే పెళ్లి..!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (varun tej) త్వ‌ర‌లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు (varun lavanya marriage). ఆరేళ్లుగా హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో (lavanya tripathi) ప్రేమ‌లో ఉన్న వ‌రుణ్‌.. జూన్‌లో త‌న ప్రేమ విష‌యాన్ని ప్ర‌క‌టించి అందరినీ స‌ర్‌ప్రైజ్ చేసాడు. ఇక పెళ్లి వేడుక‌ల గురించి వ‌రుణ్ వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 10న పెళ్లి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ట‌. పెళ్లి మాత్రం యూర‌ప్‌లో చేసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి కేవ‌లం 50 మంది అతిథులే రాబోతున్నార‌ట‌. వారిలో కొణిదెల‌, త్రిపాఠి కుటుంబాల‌కు చెందిన అత్యంత స‌న్నిహితులే హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఇది త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కు సంబంధించిన విష‌యం కాబ‌ట్టి ఎక్కువ మందిని పిలవాల‌ని వ‌రుణ్ అనుకోవ‌డంలేద‌ట‌. (varun lavanya marriage)

ఫ్రెండ్‌తోనే మ‌న జీవితం బాగుంటుంది

ఇక త‌న‌కు కాబోయే భార్య లావ‌ణ్య త్రిపాఠి గురించి చెప్తూ.. ముందు తానే ప్రపోజ్ చేసానని తెలిపాడు. ఈ ఆరేళ్ల డేటింగ్‌లో లావ‌ణ్య త‌న‌తో ఓ మంచి ఫ్రెండ్‌లా ఉండేద‌ని.. ఫ్రెండ్‌తో లైఫ్ షేర్ చేసుకుంటేనే బాగుటుంది అనేది త‌న ఫీలింగ్ అని వ‌రుణ్ అన్నాడు. ఏ విష‌యంలోనైనా కామ్‌గా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటుంద‌ని.. ఈ ఆరేళ్ల‌లో త‌న ప్ర‌తి నిర్ణ‌యాన్ని లావ‌ణ్య గౌర‌వించింద‌ని తెలిపాడు. ఇక ఆరేళ్ల డేటింగ్ తర్వాతే పెళ్లి చేసేసుకుంటే బాగుటుంద‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని ఇందుకు లావ‌ణ్య కూడా ఒప్పుకోవ‌డంతో నిశ్చితార్థం చేసుకున్నామ‌ని వెల్లడించాడు. (varun lavanya marriage)

హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్

డెస్టినేష‌న్ వెడ్డింగ్ ప్రైవేట్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. హైద‌రాబాద్‌లో మాత్రం గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఇవ్వ‌నున్నారు. సినీ, పొలిటిక‌ల్, బిజినెస్ రంగాల‌కు చెందిన ముఖ్య‌మైన‌వారు రిసెప్ష‌న్‌లో సంద‌డి చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.