Spiritual: దీపారాధన ఎలా చేస్తే మంచిది?
ఇంట్లో దీపారాధన చేస్తే ఎంతో మంచిది. కానీ చాలా మంది తెలీక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు (spiritual). ఆ పొరపాట్లు ఏంటో.. అసలు దీపారాధన ఎలా చేస్తే మంచిదో తెలుసుకుందాం.
*దీపాలు పెట్టే సెమ్మెలు లేదా కుందులు స్టీల్ మెటల్ అయ్యి ఉండకూడదు. అయితే మట్టి సెమ్మెలు వాడాలి లేదా వెండివి వాడాలి.
*చాలా మంది దీపాలను అగ్గిపుల్లతో వెలిగిస్తుంటారు. అలా చేయకూడదట. దీపాన్ని ఎప్పుడూ అగరబత్తితో వెలిగించాలట. మరి అగరబత్తిని వెలిగించాలంటే అగ్గిపెట్టే వాడాలి కదా అన్న సందేహం మీకు రావచ్చు. నేరుగా అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. అదే అగ్గిపుల్లతో అగరబత్తిని వెలిగించి ఆ తర్వాత దీపాన్ని వెలిగిస్తే మంచిది. (spiritual)
*ఒక వత్తితో దీపాన్ని ఎప్పుడూ వెలిగించకండి. ఒక వత్తితో వెలిగించేది శవాల ముందు పెడతారు. కాబట్టి ఎప్పుడూ రెండు లేదా ఆరు వత్తులతో వెలిగించాలి.
*దీపం పెట్టాక ఆ సెమ్మె లేదా కుందికి మూడు వైపులా కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి.
*విష్ణువు ఎదురుగా దీపాన్ని ఉంచకూడదు. కుడివైపు ఉంచాలి. (spiritual)
*దీపం కొండెక్కినప్పుడు.. ఆరిపోయింది అని అనకండి. దీపం కొండెక్కింది అనాలి. ఒకవేళ మళ్లీ దానినే వెలిగించాలనుకుంటే 108 సార్లు ఓం నమః శివాయ అని జపిస్తూ వెలిగించాలి.