Restaurant: టిప్ కోసం క‌స్ట‌మ‌ర్‌ను వెంబ‌డించిన వెయిట‌ర్

సాధార‌ణంగా రెస్టారెంట్ల‌కు (restaurant) వెళ్లిన బిల్లు క‌ట్టాక ఎంతో కొంత టిప్ ఇచ్చి వ‌స్తుంటాం. కొంద‌రు అది కూడా చెయ్య‌రు. మ‌న ఇండియాలో టిప్ ఇవ్వ‌క‌పోయినా ఏమీ అన‌రు కానీ.. విదేశాల్లో అలా కాదు. వాళ్లు తిన్న‌దానికి ఇంత శాతం టిప్‌గా ఇవ్వాల‌న్న రూల్ ఉంటుంద‌ట‌. ఈ రూల్‌ని బ్రేక్ చేసిన ఓ క‌స్ట‌మ‌ర్‌ను వెయిట‌ర్ వెంబ‌డించిన ఘ‌ట‌న ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. ఫ్రాన్స్‌లోని సెయింట్ ట్రోపే అనే ప్ర‌దేశం వివిధ ర‌కాల రెస్టారెంట్ల‌కు పెట్టింది పేరు.

ఇక్క‌డ ఫుడ్ ఎంత వైవిధ్యంగా ఉంటుందో కాస్ట్ కూడా అంతే ఉంటుంది. అయితే ఇట‌లీకి చెందిన ఓ వ్య‌క్తి సెయింట్ ట్రోప్‌లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. తిన్నాక బిల్లు క‌ట్టేసి 500 యూరోలు అంటే సుమారు రూ.45,000 టిప్‌గా ఇచ్చి వెళ్లిపోయాడు. అది చూసిన వెయిట‌ర్ అత‌ను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లిపోయాడ‌ని తెలుసుకుని అత‌న్ని వెతుక్కుంటూ వెళ్లాడు. ఎయిర్‌పోర్ట్ దగ్గ‌ర అత‌న్ని గుర్తుప‌ట్టి.. క‌నీసం 1000 యూరోల వ‌ర‌కు టిప్ ఇవ్వాల్సిందేన‌ని గొడ‌వ ప‌డ్డాడు. ఇందుకు అత‌ను ఒప్పుకోలేదు.  (restaurant)

ఆ ఇట‌నీ వ్య‌క్తి ఎలాగోలా త‌ప్పించుకున్నాడు. అత‌ని ఫ్రెండ్ ఒక‌రు లోక‌ల్ మీడియాతో మాట్లాడుతూ.. త‌న ప‌ట్ల జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఎంతో బాధ‌ప‌డ్డాడ‌ని ఇంకెప్పుడూ ఇక్క‌డి రెస్టారెంట్ల‌కు రాన‌ని అన్నాడ‌ని తెలిపాడు. ఫ్రాన్స్‌లోని చాలా రెస్టారెంట్లు క‌స్ట‌మ‌ర్ల‌ను వెల్త్ స్క్రీనింగ్ చేస్తాయి. అంటే.. త‌మ రెస్టారెంట్‌కు వ‌చ్చిన వ్య‌క్తి చూడ‌టానికి రిచ్‌గా ఉంటే వాళ్లు ఆర్డ‌ర్ చేసే ఫుడ్ కాస్ట్ క‌నీసం 5000 యూరోలు (4.4 ల‌క్ష‌లు) ఉండాల‌న్న రూల్ పెడ‌తార‌ట‌. ఇలా అక్క‌డికి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్ల‌ను దోచుకుంటూ ఉంటారు.