TDP: దూరంగా ఉంటున్న పెద్దోళ్లు

ఎన్నిక‌లు (ap elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో TDPలోని కొంద‌రు పెద్ద త‌ల‌కాయ‌లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిలో గల్లా జ‌య‌దేవ్ (galla jayadev), గ‌ల్లా అరుణ కుమారి (galla aruna kumari), కేసినాని నానిలు (kesineni nani) ఉన్నారు. వీరు TDPలో పేరుగాంచిన నేత‌లే. ఈసారి మాత్రం ఎలాంటి యాక్టివ్ పాలిటిల్స్‌లో ఉండ‌బోమ‌ని TDP హైకమాండ్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మ‌ధ్య‌కాలంలో నారా లోకేష్ (nara lokesh) చేప‌డుతున్న యువ‌గ‌ళం (yuvagala) పాద‌యాత్ర‌లో కానీ ఇత‌ర TDP కార్య‌క్ర‌మాల్లో కానీ వీరెవ్వ‌రూ క‌నిపించ‌డంలేదు. కేసినేని నానికి బుద్ధ వెంక‌న్న‌కు (buddha venkanna) మ‌ధ్య ఆల్రెడీ పొలిటిక‌ల్ గొడ‌వ‌లు ఉన్నాయి. సొంత పార్టీ నేత‌ల‌నే గొట్టంగాళ్లు అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. కేశినేని నాని వ్య‌వ‌హారంపై TDP కూడా కోపంగానే ఉంది. ఏం చేసినా కూడా బుద్ధా వెంక‌న్న‌, కేశినేని నానిల గొడ‌వ‌లు ఆప‌లేక‌పోయింది. అందుకే లోకేష్ పాద‌యాత్ర‌కు ఏర్పాట్లు చేసేందుకు కూడా నాని క‌ల‌గజేసుకోలేదు. ఆయ‌న‌తో పాటు ఆయ‌న కూతురు కేసినేని శ్వేత కూడా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉన్నారు.

మ‌రోప‌క్క చిత్తూరులో గ‌ల్లా అరుణ కుమారి (galla aruna kumari) హ‌వా కూడా క‌నిపించ‌డంలేదు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌గిరి నుంచి ఓడిపోయిన అరుణ TDPకి దూరంగా ఉంటున్నారు. రాజ‌కీయాల నుంచి రిటైర్ అవుతారేమో అనుకుంటున్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి చంద్ర‌గిరిలో ప‌ర్య‌టిస్తూ అక్క‌డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. బ‌హుశా రానున్న ఎన్నిక‌ల్లో ఈసారి గ‌ట్టిగా పోటీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నట్లున్నారు. ఇద్ద‌రు సిట్టింగ్ ఎంపీలు TDP కార్యక‌లాపాల‌కు దూరంగా ఉండ‌టంతో దీనిని అధికార పార్టీ YSRCP క్యాష్ చేసుకోవాల‌ని అనుకుంటోంది.