Kartikeya: ఇక ప‌బ్లిక్‌లోకి రావ‌డం త‌గ్గించేస్తా

ఇక ప‌బ్లిక్ అపియ‌రెన్స్‌లు మానేస్తాన‌ని అంటున్నారు కార్తికేయ‌ (kartikeya). ఆయ‌న న‌టించిన బెదురులంక (bedurulanka) ప్రమోష‌న్స్‌లో భాగంగా కార్తికేయ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇందుకు కార‌ణం త‌మిళ న‌టుడు అజిత్ కుమార్ (ajith kumar) అని తెలిపారు. అజిత్ కార్తికేయ క‌లిసి వాలిమై సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా అంత హిట్ అవ్వ‌డానికి కార‌ణం అజిత్ ప‌బ్లిక్ అపియ‌రెన్స్‌లు ఇవ్వ‌క‌పోవ‌డ‌మేనని అన్నారు. అజిత్ లాగే తాను కూడా ఇక షూటింగ్‌ల‌లో త‌ప్ప బ‌య‌ట ప‌బ్లిక్ ఈవెంట్స్‌లో ఎక్క‌డా క‌నిపించ‌ద‌ల‌చుకోలేద‌ని వెల్ల‌డించారు. (kartikeya)