Sravana Masam: చివరి 7 రోజులు.. ఏం కొంటే మంచిది?
శ్రావణ మాసంలో (sravana masam) చివరి వారంలోని ఏడు రోజుల్లో కొన్ని వస్తువులను కొంటే ఎంతో మంచిదట. ఆగస్ట్ 31న శ్రావణ మాసం అయిపోతుంది. శ్రావణ చివరి వారంలో ఎన్నో మంచి తిథులు, ముహూర్తాలు ఉన్నాయి. ఈ చివరి ఏడు రోజుల్లో ఏం కొంటే మంచిదో తెలుసుకుందాం.
ఆగస్ట్ 24
ఈ తేదీన కొన్ని వస్తువులను కొంటే రాజయోగం సిద్ధిస్తుందట. ఏదైనా వాహనం కానీ ప్రాపర్టీ కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఆగస్ట్ 24న మంచి రోజు. (sravana masam)
ఆగస్ట్ 25
సర్వర్ధ సిద్ధి యోగం రాజయోగం రెండూ సిద్ధించే రోజు కాబట్టి ఏవైనా పెట్టుబడులు చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా, బంగారం కొనుగోలు చేసినా మంచిదే.
ఆగస్ట్ 26
రవి యోగం ఉంటుంది కాబట్టి వాహనాలు, నగలు కొనుగోలు చేస్తే మంచిది. (sravana masam)
ఆగస్ట్ 29
రవి యోగం, అమృత కాలం, విజయ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఏం కొన్నా కూడా మంచిదే. ఏదైనా కొత్త పనులు ప్రారంభించినా శుభ ఫలితాలు అందుకుంటారు.
ఆగస్ట్ 30
అమృత కాలం, విజయ ముహూర్తం ఉంది కాబట్టి వాహనాలు కొంటే మంచిది
ఆగస్ట్ 31
ఇక శ్రావణ మాస చివరి రోజున ఏ పని తలపెట్టినా అంతా మంచే జరుగుతుంది. (sravana masam)