Posani: నన్ను మంగళగిరి తీసుకెళ్లి చంపబోతున్నారు
TDP జనరల్ సెక్రటరీ పోసాని కృష్ణమురళి (posani) షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. లోకేష్ (nara lokesh) తనను మంగళగిరికి తీసుకెళ్లి హత్య చేయాలని అనుకుంటున్నాడని, తను చచ్చిపోతే ఆ చావుకు కారణం లోకేషేనని మీడియా ముందుకు వెల్లడించారు. (posani krishna murali)
ఇటీవల పరువు నష్టం దావా కేసు విషయమై లోకేష్ మాట్లాడుతూ.. పోసానికి ఎన్ని నోటీసులు పంపినా స్పందించడంలేదని.. కోర్టుకు కూడా రావడంలేదని అన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిజమే అయితే పోసాని మంగళగిరి వచ్చి తీరాలని చాలెంజ్ చేసారు. దీనిపై పోసాని మాట్లాడుతూ.. “” నన్ను చంపేందుకు లోకేష్ ప్లాన్ చేస్తున్నాడు. కోర్టు నోటీసులు అని చెప్పి నన్ను మంగళగిరికి పిలిపించి కోర్టుకు వెళ్తున్న సమయంలోనో బయటికి వస్తున్న సమయంలోనే చంపించాలని అనుకుంటున్నాడు. నేను లంగా గాడిని కాను. నేను అమ్ముడుపోయే రకాన్ని కాను. రేపు నేను అనుమానాస్పద స్థితిలో చనిపోతే దానికి కారణం చంద్రబాబు నాయుడు కుమారుడు, బ్రాహ్మణి భర్త, భువనేశ్వరి తనయుడు లోకేషే “” అని వివాదాస్పదంగా మాట్లాడారు.