Mynampally: సారీ చెప్పకపోతే గెంటుడే..!?
నరంలేని నాలుకని అదుపులో పెట్టుకోవాలి అంటారు. టికెట్ ఇవ్వలేదని కొందరు వెకిలి చేష్టలకు పాల్పడుతుంటే.. టికెట్ ఇచ్చినప్పటికీ కొడుక్కి ఇవ్వలేదని ఏడ్చేవారు ఇంకోవైపు. ఇదే కేటగిరీలో ఉన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (mynampally). తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని.. ఇందులో హరీష్ రావు (harish rao) పెత్తనం ఎందుకని నోటికొచ్చినట్లు వాగేసారు. నిన్న ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో మైనంపల్లి పేరు ఉంది కానీ ఆయన కుమారుడికి మాత్రం టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా మైనంపల్లి వేరే పార్టీలోకి వెళ్తానంటే తాను మాత్రం ఆపనని నిన్న KCR కూడా అన్నారు. ఇప్పుడు మైనంపల్లి ముందు ఉన్నవి రెండే ఆప్షన్లు. ఒకటి పబ్లిక్‌గా హరీష్ రావుకి సారీ చెప్పడం.. లేదా పార్టీ వదిలి వెళ్లిపోవడం. సారీ చెప్పకపోతే మాత్రం పార్టీ హైకమాండే ఆయన్ను గెంటే ఛాన్స్ ఉంది. ఎందుకంటే.. నిన్న KCR మీడియా ముందు డైరెక్ట్‌గా హెచ్చరించారు. ఎవరైతే టికెట్ ఇవ్వలేదన్న కోపంలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటాలు, పనులు చేయడాలు వంటివి చేస్తారో వారిపై వేటు కాదు నేరుగా గెంటుడే అని. మరి ఇప్పుడు మైనంపల్లి ఏ ఆప్షన్‌ను ఎంచుకుంటారో వేచి చూడాలి. (mynampally hanumanth rao)