YS Sharmila: BRSకి డిపాజిట్లు కూడా రావు
BRS పార్టీకి డిపాజిట్ ఓట్లు కూడా రావని.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఓటర్లు తన్ని తరిమేస్తారన్న భయంతోనే KCR కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారని అన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైఎస్ షర్మళ (ys sharmila). దమ్ముంటే KCR గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలివాలని సవాల్ విసురుతున్నట్లు తెలిపారు.
“” గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుంది. అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ. స్వయానా ముఖ్యమంత్రికే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం KCR పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో BRS పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం. దొర గారు ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు.. వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు.. పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే.. దళిత బంధు అందకపాయే.. ఇక దొర గజ్వేల్ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే.. రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో KCR గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండు.. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే.. సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాల్ చేస్తున్నాం “” అని ట్వీట్ చేసారు (ys sharmila)
జర్నలిస్ట్‌లను పాములతో పోలుస్తారా?
“” ఉద్యమాన్ని ముందుండి నడిపిన జర్నలిస్టులను KCR పాములతో పోల్చడం బాధాకరం.మీ అక్రమాలపై, మీ బంది పోట్ల రాష్ట్ర సమితి దోపిడీ పై నిజానిజాలు బయటపెడితే విషం చిమ్మినట్లా దొరా? జర్నలిస్టులు జీవితాలు త్యాగం చేయకపోతే రాష్ట్రం వచ్చేదా? ఈ నియంతకు అధికారం దక్కేదా? విషం చిమ్మే పత్రికల జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వం అంటూ ముఖ్యమంత్రి KCR చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను YSR తెలంగాణ పార్టీ ఖండిస్తోంది. తక్షణమే KCR జర్నలిస్టు మిత్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పదవులు కుటుంబానికి పంచుకున్నట్లు.. పథకాలు పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నట్లు… జర్నలిస్టుల ఇండ్లు,స్థలాలు దొరకు భజన చేసేటోళ్లకే ఇద్దాం అనుకుంటుండు.. మీకు నచ్చినోళ్లకు ఇచ్చుకోవడానికి రాష్ట్రం మీ అబ్బ సొత్తేం కాదు. భజన చేస్తే ఇస్తాం అనడానికి మీరు శాశ్వతం కాదు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం జర్నలిస్టులు చేసిన పోరాటాన్ని మరిచి దొర అధికార మదంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నడు.ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పూటకో మాట చెప్పే గుంట నక్క KCR. అవసరం తీరాక జర్నలిస్టులను కాటేసిన కాలనాగు KCR “” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.