KCR: ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేసాడని ఒప్పుకున్నా

ఈసారి కామారెడ్డి (kamareddy) నుంచి ఎందుకు పోటీచేయాల‌ని అనుకుంటున్నారు అని KCR ను ప్ర‌శ్నించ‌గా.. కామారెడ్డి ఎమ్మెల్యే రిక్వెస్ట్ మేర‌కు చేస్తున్నాన‌ని తెలిపారు. చ‌రిత్ర చూసుకుంటే గ‌తంలో మెహ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి కూడా పోటీ చేసి గెలిచాన‌ని.. పార్టీ తీర్మానించింది కాబ‌ట్టి కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాన‌ని తెలిపారు. ఈసారి గ‌జ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 95 నుంచి 105 సీట్ల వ‌ర‌కు తామే గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు KCR. మొత్తం 119 స్థానాల‌కు గానూ అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించిన KCR.. మ‌రో నాలుగు స్థానాల‌ను పెండింగ్‌లో ఉంచిన‌ట్లు తెలిపారు.