Jr NTR మోక్షజ్ఞ కబుర్లు..!
ఆదివారం రాత్రి నందమూరి కుటుంబంలో శుభకార్యం జరిగింది. నందమూరి హరికృష్ణ సోదరి సుహాసిని కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (jr ntr) కూడా వెళ్లాడు. ఈ సందర్భంగా వేడుకలో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞతో (mokshagnya) తారక్ కబుర్లు చెప్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మోక్షజ్ఞకు సినిమా ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలో తారక్ ట్రైనింగ్ ఇస్తున్నారేమో అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.