Bhola Shankar: రామ్ చ‌ర‌ణ్ నాన్న అంటూ ప్ర‌మోషన్స్

మెహ‌ర్ ర‌మేష్ (meher ramesh) తీసిన క‌ళాకండం భోళా శంక‌ర్‌ను (bhola shankar) హిందీలోనూ రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో చిరంజీవికి (chiranjeevi) జాకీ ష్రాఫ్ డ‌బ్బింగ్ చెప్తున్నారు. ఇందుకోసం అక్క‌డ కూడా ప్ర‌మోష‌న్స్ చేయ‌డానికి ఒక పోస్ట‌ర్ రెడీ చేయించారు. ఆ పోస్ట‌ర్‌పై చిరంజీవి.. RRR స్టార్ రామ్‌చ‌ర‌ణ్ నాన్న న‌టించిన భోళా శంక‌ర్ అని రాయ‌డం వైర‌ల్ అవుతోంది. అక్క‌డి వారికి చిరంజీవి అంటే క‌చ్చితంగా తెలిసే ఉంటుంది. చిరు చిన్న హీరో కాదు. టాలీవుడ్ మెగాస్టార్. అలాంటిది ఆయ‌న ఎవ్వ‌రికీ తెలీద‌న్న‌ట్లు ఇలా రామ్ చ‌ర‌ణ్ (ram charan) వాళ్ల నాన్న సినిమా ప్లీజ్ చూడండి అని రిక్వెస్ట్ చేసిన‌ట్లు ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. (bhola shankar hindi release)