Rajinikanth: అర్థంకాలేదు రాజా..!
రజినీకాంత్.. జస్ట్ రజినీకాంత్ (rajinikanth) అని పిలవడం చాలా మంది ఫ్యాన్స్ మర్చిపోయారు. ఆయన పేరుకి ముందు సూపర్‌స్టార్ అనో తలైవా అనో ఒక ట్యాగ్ తగిలించి మరీ పిలుస్తారు. అలాంటి ఆయన.. వయసులో తనకంటే 20 ఏళ్లు చిన్నవాడికి కాళ్లు మొక్కారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను (yogi adityanath) కలవడానికి యూపీ వెళ్లిన రజినీ.. కారు దిగగానే ఏదో సాక్షాత్తు భగవంతుడి విగ్రహం కనిపించినట్లు వెళ్లి కాళ్లు మొక్కారు. దాంతో రజినీ ఇంతలా దిగజారిపోయారేంటి అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. (rajinikanth touches yogi adityanath feet)
మన హిందూ ధర్మం ప్రకారం.. వయసులో మనకంటే చిన్నవారి కాళ్లు పట్టుకునే వారికి ఆయుక్షీణం అంటారు. ఆదిత్యనాథ్ బ్రహ్మచర్యం స్వీకరించి యోగిగా 22 ఏళ్ల నుంచి దీక్షలో ఉన్నారట. అంతేకాదు.. ఆదిత్యనాథ్ గోకర్నాథ్ మఠానికి గురువట. అందుకే రజినీ ఏ యోగి కనిపించినా వారిని దైవంగా భావించి కాళ్లు మొక్కారని కొందరి వాదన. అదే నిజమైతే తమని తాము హిందువులు అని చెప్పుకుని తిరుగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు ఎందుకు యోగి కాళ్లు మొక్కలేదు అని ప్రశ్నిస్తున్నారు. (rajinikanth)
అసలు ఎందుకు రజినీ యూపీ వెళ్లారు?
రజినీకాంత్ ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎందుకు వెళ్లారంటే..ఆయన నటించిన జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా ఈ సినిమాను సీఎంతో కలిసి చూసేందుకు వెళ్లారట. ఆల్రెడీ కేరళ సీఎం పినరయి విజయన్ ఈ సినిమాను ఫ్యామిలీతో చూసేసారు. అది ఆయన ఫ్యామిలీ టైం కాబట్టి సినిమా చూసారు అనుకోవచ్చు. మరి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు చూడాలనుకుంటున్నారు? అసలు జైలర్ సినిమాలో రాజకీయాలను ప్రభావితం చేసేంతగా ఏమీ లేదు. స్ఫూర్తిపొందే అంశాలు అసలే లేవు. మరెందుకు చూడాలనుకుంటున్నారో వారికే తెలియాలి.
అర్థంకాలేదు రాజా..!
రజినీకాంత్ (rajinikanth) నుంచి ఫ్యాన్స్ ఇలాంటి సన్నివేశాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జైలర్ (jailer) సినిమాలో ఆయన చెప్పిన అర్థమయ్యిందా రాజా డైలాగ్‌ను ఆయనకే వాడి మరీ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రజినీకాంత్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రెండింగ్‌లో రజినీ ఆదిత్యనాథ్ కాళ్లు మొక్కడమే వైరల్ అవుతోంది.