Jagan: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బై బై..?
రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (jagan) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు గుడ్‌బై చెప్పి.. ఎక్కువ శాతం ఎంపీలకు టికెట్ ఇవ్వాలన్న యోచనలో ఉన్నారట. (ysrcp) ఈసారి ఎన్నికల్లో దాదాపు 35 నుంచి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే TDP అధికారంలో ఉన్న టెక్కలి, అద్దంకి, కుప్పం, మండపేట, తూర్పు విజయవాడ, రాజమండ్రి నియోజకవర్గాల్లో YSRCP నుంచి ఎవరు పోటీ చేయనున్నారు అనే విషయంపై జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టి వంగ గీత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చింతా అరుణ, మార్గాని భరత్, అడల ప్రభాకర్ రెడ్డి వంటి ఎంపీలకు టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారట. (jagan)
మరో విషయం ఏంటంటే.. తన పార్టీలోని యాక్టివ్ ఎమ్మెల్యేలను ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చి పోటీ చేయించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు రానున్న ఎన్నికల్లో తమ కుమారులకు టికెట్ ఇవ్వాలని జగన్‌ని కోరారు. ఐప్యాక్ సర్వే ప్రకారం చాలా మంది యాక్టివ్ ఎమ్మెల్యేల పెర్ఫామెన్స్ అనుకున్న స్థాయిలో లేదట. అలాంటివారికి కూడా టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. (jagan)