Kadiyam Srihari: అభివృద్ధి కావాలంటే న‌న్ను ఎన్నుకోండి

అభివృద్ధి కావాలంటే త‌న‌ను ఎన్నుకోవాల‌ని అన్నారు BRS ఎమ్మెల్సీ క‌డియం శ్రీహ‌రి (kadiyam srihari) . కొంత‌కాలంగా శ్రీహ‌రికి ఎమ్మెల్యే రాజయ్య‌కి (t rajaiah) మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌గామ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న్‌పూర్ ప్ర‌జ‌ల‌కు రాజ‌య్య పేరు తీయడానికి కూడా సిగ్గుప‌డుతున్నార‌ని అన్నారు. త‌న‌కు ఎమ్మెల్యేగా ఒక్క అవ‌కాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాన‌ని తెలిపారు.

నిన్న స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో నిర్వ‌హించిన స‌మావేశంలో క‌డియం శ్రీహ‌రి (kadiyam srihari) పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇక్క‌డి ప్ర‌జ‌లే త‌న‌కు రాజ‌కీయ కెరీర్ ఇచ్చార‌ని అన్నారు. ప్ర‌జ‌ల స‌హ‌కారంతోనే అభివృద్ధి ప‌నులు చేసాను కానీ ఎప్పుడూ త‌ప్పుడు ప‌నులు చేయ‌లేద‌ని తెలిపారు. అయితే ఎక్క‌డ త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఎన్నిక‌ల్లో గెలిచేస్తే భూక‌బ్జాల‌కు పాల్ప‌డిన‌వారు నియోజ‌క‌వ‌ర్గం వ‌దిలి వెళ్లిపోవాల్సిన వ‌స్తుందోనని భ‌య‌ప‌డి త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈసారి రానున్న ఎన్నిక‌ల్లో BRS సిట్టింగ్ నేత‌ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌నుకుంటున్న సంగ‌తి తెలిసిందే.