Pawan Kalyan: పొత్తు ఎవరితోనో త్వరలో తెలుస్తుంది
Pawan about alliance: రానున్న ఎన్నికల్లో పొత్తు జనసేన-BJP మధ్యనా, లేక జనసేన-BJP-TDP మధ్యనా అనేది త్వరలో తెలుస్తుందని అన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan). ఎన్నికల తరువాత మాత్రమే ఎమ్మెల్యేలని బట్టే ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయం జరుగుతుందని స్పష్టం చేసారు. ప్రస్తుతానికైతే జనసేన (janasena) మద్దతు BJPకే ఉందని క్లియర్ అయిపోయింది. ఇక TDP పొత్తులో భాగం అవ్వాలనుకున్నా కూడా కాలేని పరిస్థితి. ఎందుకంటే TDPని చేర్చుకోవాలని BJPకి అస్సలు లేదు. ఒకవేళ TDP పొత్తు పెట్టుకోకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో గెలవడం అతికష్టమని సర్వేలు చెప్తున్నాయి. పొత్తు లేకపోతే మాత్రం మళ్లీ వచ్చేది జగన్ సర్కారేనని (ysrcp) అంటున్నారు.
ఇక ప్రెస్మీట్లో సాక్షి రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. “”పాలసీ నచ్చకపోతే ప్రధాన మంత్రి గురించే మాట్లాడినవాడిని నేను. ఇక చంద్రబాబు, జగన్ ఎంత ? 151 సీట్లు ఇస్తే పాలించాల్సింది పోయి, దుర్మార్గం చేస్తున్నాడు గనుకే నాకు జగన్ కన్నా TDP బెటర్ అనిపించింది. అందుకే ఓటు చీలనివ్వను అంటున్నాను “” అని తెలిపారు.