Anil Sunkara: రూమ‌ర్స్‌కి చెక్ పెట్టిన నిర్మాత‌

మొత్తానికి నిర్మాత అనిల్ సుంక‌ర (anil sunkara) త‌న గురించి మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) గురించి వ‌స్తున్న రూమ‌ర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టారు. త‌ప్పుడు వార్త‌లు రాసేవారు, స్ప్రెడ్ చేసేవారికి ఇలాంటి వాటి నుంచి రాక్ష‌సానందం ఉంటుందేమో కానీ ఇన్‌వాల్వ్ అయ్యి ఉన్న‌వారిపై మాత్రం తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని అనిల్ అన్నారు. చిరంజీవి త‌న‌తో షూటింగ్ స‌మ‌యంలో బాగానే ఉన్నార‌ని ఇప్పుడు కూడా త‌మ అనుబంధం బాగానే ఉంద‌ని అన్నారు. త్వ‌ర‌లో ఓ మంచి క‌మ్‌బ్యాక్ ఇస్తాన‌ని తెలిపారు.

మెగాస్టార్ న‌టించిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమాకు అనిల్ సుంక‌ర (anil sunkara) నిర్మాత‌గా వ్య‌హ‌రించారు. బాక్సాఫీస్ దగ్గ‌ర డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ సినిమాపై ఇప్ప‌టికే ట్రోలింగ్ ఓ రేంజ్‌లో అవుతోంది. అదీకాకుండా అనిల్ సుంక‌ర ఇంకా చిరుకి పారితోషికం ఇవ్వ‌లేద‌ని కొంద‌రు, చిరు డిమాండ్ చేయ‌డంతో త‌న ఆస్తులు అమ్మి మ‌రీ రెమ్యునరేష‌న్ ఇచ్చార‌ని మ‌రికొంద‌రు తెగ కామెంట్స్ పెట్టారు. వాటిలో ఏమాత్రం నిజం లేద‌ని అనిల్ సుంక‌ర క్లారిటీ ఇచ్చారు.