Mansoor Khan: ఆమిర్ ఖాన్ ఓవ‌రాక్ష‌న్.. రాజ‌మౌళే అన్నారు

లాల్ సింగ్ చ‌ద్దా (laal singh chaddha) సినిమాలో ఆమిర్ ఖాన్ (aamir khan) ఓవ‌రాక్ష‌న్ చేసాడ‌ని రాజ‌మౌళి (rajamouli) త‌న‌తో చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు ఆమిర్ సోద‌రుడు మ‌న్సూర్ ఖాన్ (mansoor khan). 2022లో రిలీజ్ అయిన లాల్ సింగ్ చ‌ద్దా ఫ్లాప్ అయింది. లాల్ సింగ్ చ‌ద్దాలో యాక్టింగ్ కాస్త ఓవ‌ర్ అయిన‌ట్లు తాను ఎప్పుడో ఆమిర్‌కి చెప్పాన‌ని కానీ రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు కూడా అదే మాట అన‌డంతో ఆమిర్‌కి అప్పుడు అర్థ‌మైంద‌ని మ‌న్సూర్ తెలిపారు.

ఇంత‌కీ ఇప్పుడు ఈ సినిమా డిస్క‌ష‌న్ ఎందుకు వ‌చ్చిందంటే.. మ‌న్సూర్ (mansoor khan) వ‌న్: ది స్టోరీ ఆఫ్ అల్టిమేట్ మిత్ అనే ఒక పుస్త‌కం రాసారు. దానిని ఈరోజు ముంబైలో రిలీజ్ చేసారు. ఆ స‌మ‌యంలో మీడియాతో మాట్లాడుతుండ‌గా ఆమిర్ లాల్ సింగ్ చ‌ద్దా ఫ్లాప్ అయింది కాబట్టి ఆయ‌న ఎప్ప‌టి వ‌ర‌కు బ్రేక్ తీసుకోనున్నారు అని అడిగారు. ఈ ప్ర‌శ్న‌కు మ‌న్సూర్ స‌మాధానం ఇస్తూ రాజ‌మౌళి అన్న మాట‌ల‌ను షేర్ చేసుకున్నారు.

“” హాలీవుడ్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన ఫారెస్ట్ గంప్ సినిమా నాకు చాలా ఇష్టం. అదే సినిమాను అన్న‌య్య ఆమిర్ లాల్ సింగ్ చ‌ద్దాగా రీమేక్ చేసారు. అంద‌రికంటే ముందు మా అన్న‌కు నా అభిప్రాయాన్ని చెప్పేస్తాను. లాల్ సింగ్ చ‌ద్దాలో ఓవ‌రాక్ష‌న్ చేసావ్ అని అన్న‌య్య‌కు చెప్పాను. ఆయ‌న విన‌లేదు. ఆ త‌ర్వాత ఓసారి రాజ‌మౌళి క‌లిసిన‌ప్పుడు ఆయ‌న కూడా ఇదే మాట అన్నార‌ట‌. అప్పుడు అన్న‌య్య నా ద‌గ్గ‌రికి వచ్చి.. నువ్వు ఎప్పుడూ ఏదో ఒక‌టి చెప్తుంటావ్ కాబ‌ట్టి నేను నీ అభిప్రాయాన్ని ప‌ట్టించుకోలేదు. కానీ రాజ‌మౌళి కూడా అదే మాట అన్నారంటే నిజంగానే ఓవ‌రాక్ష‌న్ చేసి ఉంటానేమో అని నాతో అన్నారు“” అని వెల్ల‌డించారు మ‌న్సూర్.