Jagga Reddy: BRSలోకి సంగారెడ్డి ఎమ్మెల్యే

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి (jagga reddy) BRS లో చేర‌నున్నారు. ఈ నెల 19 లేదా 20వ తేదీన చేరబోతున్నట్లు సమాచారం. ఇటీవ‌ల తెలంగాణ అసెంబ్లీ (telangana assembly session) స‌మావేశాల్లో  కూడా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR.. జ‌గ్గారెడ్డితో ముచ్చ‌టించిన తీరు వైర‌ల్‌గా మారింది. జ‌గ్గా రెడ్డి అసెంబ్లీకి టీష‌ర్ట్ వేసుకొని వ‌స్తే.. ఏమ‌న్నా.. మంచిగా టీష‌ర్ట్ ఏషిన‌వ్ అని KTR స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించారు. అప్పుడు జ‌గ్గారెడ్డి.. ఏమైంది యువ‌కులే టీష‌ర్టులు వేసుకోవాలా అంటూ న‌వ్వుతూ స‌మాధాన‌మిచ్చారు.