Bride: పెళ్లైన మ‌రు క్ష‌ణ‌మే విడాకులు..!

ఓ యువ‌తి పెళ్లి జ‌రిగిన మ‌రుక్ష‌ణ‌మే విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకుంది (bride). ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. చాలా మంది ఆమె తీసుకున్న నిర్ణ‌యం స‌రైన‌దేన‌ని అంటున్నారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. ఓ యువ‌తి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన స్టోరీ ప్ర‌కారం.. వారిద్ద‌రూ (పేర్లు చెప్ప‌లేదు) ప్రేమించుకున్నార‌ట‌. 2020లో అబ్బాయే ఆ యువ‌తికి ప్ర‌పోజ్ చేసారు. అమ్మాయి కూడా ఒకే చేసింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్నారు. 2022 డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ రోజున వీరి పెళ్లి గ్రాండ్‌గా జ‌రిగింది.

అయితే పెళ్లి వేడుక‌లలో కేక్ క‌ట్ చేసేట‌ప్పుడు త‌న ముఖానికి కేక్ పూయొద్ద‌ని చెప్పింద‌ట‌. ఆమెకు కొన్ని అలెర్జీలు ఉన్నాయ‌న్న సంగ‌తి ఆ అబ్బాయికి కూడా తెలుసు. అయినా కూడా ఆమె మాట‌కు విలువ ఇవ్వ‌కుండా అంద‌రూ చూస్తుండ‌గానే ముఖాన్ని కేకులో ముంచాడ‌ట‌. దాంతో ఆ అమ్మాయికి పీక‌ల దాకా కోపం వ‌చ్చింది. ఆ మ‌రు క్ష‌ణ‌మే విడాకులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకుంది. కానీ ఆ స‌మ‌యంలో అంద‌రి ముందు ఏమీ మాట్లాడ‌లేదు కానీ వివాహ వేడుక‌కు వ‌చ్చిన వారంతా వెళ్లిపోయాక ఆ అమ్మాయి నేరుగా త‌న పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకుల‌కు ద‌ర‌ఖాస్తు చేసింది. (bride)

ఇంట్లో వారు ఎంత చెప్పినా కూడా ఆమె సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌డానికి ఒప్పుకోలేదు. త‌న‌తో 2 ఏళ్లు రిలేష‌న్‌షిప్‌లో ఉన్న వ్య‌క్తికి త‌న గురించి అన్నీ తెలిసి కూడా త‌న మాట‌కు విలువ ఇవ్వ‌లేదంటే.. అలాంటి వ్య‌క్తితో ఎలా క‌లిసి బ‌తకాలి అని వాదించింది. అతనికి విడాకుల పేప‌ర్లు పంపాన‌ని.. కోర్టులో కూడా త‌న బాధ‌ను జ‌డ్జి అర్థం చేసుకుని జ‌న‌వ‌రి 30 క‌ల్లా విడాకులు మంజూరు చేసారంటూ సోష‌ల్ మీడియాలో త‌న బాధ‌ను చెప్పుకుంది ఆ యువ‌తి. (bride)