Bank: టెక్నిక‌ల్ లోపం.. దండుకున్న‌ క‌స్ట‌మ‌ర్లు

ఓ బ్యాంక్‌లో (bank) టెక్నిక‌ల్ స‌మ‌స్య రావ‌డంతో క‌స్ట‌మ‌ర్లు డ‌బ్బుల‌ను బాగా దండుకున్నారు. ఈ ఘ‌ట‌న ఐర్లాండ్‌లో (ireland) చోటుచేసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్‌లో (bank of ireland) ఏదో టెక్నిక‌ల్ లోపం త‌లెత్తింది. దాంతో ఏటీఎంల నుంచి దాదాపు వెయ్యి డాల‌ర్ల వ‌ర‌కు విత్‌డ్రా చేసుకున్నారు అక్క‌డి ప్ర‌జ‌లు. ఈ విష‌యం ఆ బ్యాంక్ (bank) క‌స్ట‌మ‌ర్ల‌కు ఎలా తెలిసిందో ఏమో కానీ.. ఏటీఎం బ‌య‌ట క్యూ కట్టారు. వారి ఖాతాల్లో డ‌బ్బులు ఉన్నా లేక‌పోయినా అంద‌రికీ వెయ్యి డాల‌ర్ల వ‌ర‌కు డ‌బ్బు ముట్టింది.

ఎందుకంటే బ్యాంక్‌లో టెక్నిక‌ల్ స‌మ‌స్య కార‌ణంగా అంద‌రి ఖాతాల్లోకి 1000 డాల‌ర్లు జ‌మ అయిపోయాయి. దాంతో బ్యాంక్ పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చింది. పోలీసులు రాక‌ముందు వ‌ర‌కు విత్‌డ్రా చేసుకున్నవారు ఎస్కేప్ అయిపోయారు. ఆ త‌ర్వాత వ‌చ్చి లైన్‌లో నిల్చున్న‌వారిని పోలీసులు వెళ్ల‌గొట్టారు. బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్‌కు సంబంధించిన ఏటీఎంల ముందు కొన్ని రోజుల పాటు పోలీసులు ఉండ‌నున్నారు.