Vangaveeti Radha: పెళ్లిపీట‌లెక్క‌బోతున్న రాధ‌

మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధ (vangaveeti radha) పెళ్లి పీట‌లు ఎక్క‌బోతున్నారు. ఈనెల 19వ తేదీన నిశ్చితార్ధం జ‌ర‌గ‌నుంది. వచ్చే నెల 6వ తేదీన వివాహం జ‌ర‌గ‌బోతోంది. రాధ‌కు కాబోయే భార్య‌ నరసాపురంకు చెందిన మాజీ మున్సిపల్ ఛైర్‌ప‌ర్స‌న్ జక్కం ఆమ్మాణి, బాబ్జిల చిన్నకుమార్తె జక్కం పుష్ప వల్లీ. వంగవీటి రాధ ప్రస్తుతం TDPలో కొనసాగుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఇటీవల తిరిగి యాక్టివ్ అయ్యిన విషయం తెలిసిందే. (vangaveeti radha marriage)