Rushikonda Issue: రామానాయుడు స్టూడియో ఎలా కట్టారు?
జనసేనాని పవన్ కళ్యాణ్ (pawan kalyan), TDP అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) YSRCP నేతలు విడదల రజని, ఎస్ ఏ రెహమాన్, అదీప్ రాజ్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. వైజాగ్లోరి రుషికోండ (rushikonda issue) గురించి పవన్ ఏమీ తెలీకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వారాహి విజయ యాత్రలో (varahi yatra) భాగంగా పవన్ రుషికొండలో పర్యటించాల్సి ఉంది. కానీ అందుకు అక్కడి పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఆయన్ను బోర్డర్ దగ్గరే ఆపేసారు. దాంతో పవన్ కారు పైకి ఎక్కి మరీ కెమెరాలతో వీడియోలు తీయించి రుషికొండపై అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేసారు.
దీనిపై విశాఖ ఇన్చార్జ్ విడదల రజనీ (vidadala rajini) స్పందించారు. వైజాగ్ నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డిని (jagan mohan reddy) కార్యకలాపాలు చెయ్యనివ్వకుండా పవన్, చంద్రబాబు అడ్డుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు తనకి తాను ఒక గొప్ప మేధావి అనే భ్రమలో ఉంటారని, ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే అది నిజమైపోతుందని అనుకుంటూ ఉంటారని మండిపడ్డారు. చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం పవన్ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే రుషికొండపై రిసార్టులు ఏర్పాటుచేయాలనుకున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారని అన్నారు. (rushikonda issue)
రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడట్లేదే?
YSRCP పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ (adeep raj) మాట్లాడుతూ.. రుషికొండను తవ్వేస్తున్నారని పవన్‌కు అంత బాధ కలిగినప్పుడు రామోజీ రావు అవే కొండల్ని తవ్వించి ఫిలిం సిటీ కట్టినప్పుడు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. గీతమ్ కాలేజీలు కూడా అలా కట్టించినవేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను దండుపాళ్యం బ్యాచ్‌లో పవన్ పోల్చారని, ప్రజలు ఆయన మాట్లాడే ప్రతీ మాటను వింటున్నారని అన్నారు. (rushikonda issue)
పవన్‌కి అల్జీమర్స్ చంద్రబాబుకి డిమెన్షియా
మరో YSRCP నేత ఎస్ ఏ రెహమాన్ కూడా పవన్ మాటలపై స్పందించారు. రామానాయుడు స్టూడియో ఎలా కట్టారో అందరికీ తెలుసని, TDP హయాంలోనే కొండలను తవ్వించేసి నిర్మించారని గుర్తుచేసారు. పవన్‌కి మానసిక సమస్యలు ఉన్నందున ఆయన మర్చిపోయినట్లున్నారని అన్నారు. TDP హయాంలోనే వైజాగ్‌లో ఎక్కువ భూముల ఆక్రమణ జరిగిందని ఓసారి ఆ పార్టీ నేత అయ్యన్న పాత్రుడే అన్నారని తెలిపారు. పవన్‌కి అల్జీమర్స్, చంద్రబాబుకి డిమెన్షియా ఉండటం వల్ల మర్చిపోయారేమో కానీ ప్రజలకి మాత్రం బాగా గుర్తుందని అన్నారు.