YS Sharmila పాద‌యాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో!

తెలంగాణలో 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు గాను వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధినేత్రి వైయస్ షర్మిల (ys sharmila) ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో (indian book of records) చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన మొదటి మహిళగా వైయస్ షర్మిల గారు రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలను కలిసి అభినందించి అవార్డు ఇచ్చారు.

2021 అక్టోబ‌ర్‌లో ష‌ర్మిళ త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అదే సంవ‌త్స‌రంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వ‌ర్ధంతి రోజున వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు ష‌ర్మిళ‌. త‌న పాద‌యాత్ర‌తో కేవ‌లం 148 రోజుల్లోనే దాదాపు 2కోట్ల మంది ప్ర‌జ‌ల‌ను క‌లిసి వారి బాధ‌లను తెలుసుకున్నార‌ట‌. పాద‌యాత్ర‌లో భాగంగా 34 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు, 31 మున్సిపాలిటీలు, 104 మండ‌లాలు, 987 గ్రామాల్లో తిరిగారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ నుంచి ఏ నాయ‌కుడు కానీ నాయ‌కురాలు కానీ ఈ రేంజ్‌లో పాద‌యాత్ర చేయ‌లేద‌ట‌. (ys sharmila)