Varun Tej: ఆ ట్రాప్‌లో పడొద్దని చెప్పాడు
ఎలాంటి కథలు ఎంచుకోవాలనే విషయంలో తనకు అన్న రామ్ చరణ్ (ram charan) బాగా హెల్ప్ చేస్తున్నాడని అన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (varun tej). గాండివధారి అర్జున (gandeevadhari arjuna) సినిమాతో త్వరలో ఆయన ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. గని (ghani) సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో ఈ సినిమాపై బాగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ గ్యాప్‌లోనే ఆపరేషన్ వాలెంటైన్ (operation valentine) అనే సినిమాను కూడా అనౌన్స్ చేసేసాడు వరుణ్. ఈ మధ్యకాలంలో ఆయన లవ్ స్టోరీలు అస్సలు టచ్ చేయడంలేదు. ఎందుకు అని అడిగితే.. తన ఏడో సినిమా తర్వాత చరణ్ కాల్ చేసి విభిన్నమైన స్క్రిప్ట్ ఎంచుకోవాలని చెప్పాడట.
“” ఓసారి రామ్ చరణ్ అన్న కాల్ చేసాడు. యునీక్ స్క్రిప్ట్ ఎంచుకోవాలని చెప్పాడు. నా చుట్టూ ఉన్నవారంతా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తుంటారు ఆ ట్రాప్‌లో మాత్రం అస్సలు పడకు అని సలహా ఇచ్చాడు. ఇప్పుడు నేనున్న పొజిషన్లో అన్ని ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్స్ ఎంచుకోవాలని అన్నాడు. నేను అదే ఫాలో అవుతున్నా “” అని తెలిపాడు వరుణ్.