Madhya Pradesh: క‌ళ్లుతిరిగి ప‌డిపోయిన మంత్రి, స్పీక‌ర్..!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) వైర‌ల్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) సంద‌ర్భంగా జెండాను ఎగిరేస్తున్న స‌మ‌యంలో ఒక‌రు, ప్రసంగిస్తూ ఒక‌రు వేరు వేరు ప్రాంతాల్లో సొమ్మసిల్లి ప‌డిపోయారు. రైసెన్ ప్రాంతంలో ఆరోగ్య శాఖ మంత్రి ప్ర‌భురామ్ చౌద‌రి  (prabhuram chaudhary) జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ కుప్ప‌కూలిపోయారు. వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆయ‌న బ్ల‌డ్ ప్రెష‌ర్ లో అవ‌డంతో ప‌డిపోయార‌ని ఇప్పుడు బాగానే ఉన్నార‌ని వైద్యులు తెలిపారు.

మ‌రో ఘ‌ట‌న‌లో మౌగంజ్ ప్రాంతంలో అసెంబ్లీ స్పీక‌ర్ గిరీష్ గౌతమ్ జెండాను ఎగ‌రేస్తూ క‌ళ్లు తిరిగిప‌డిపోయారు. స్థానిక డాక్ట‌ర్‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి తీసుకువ‌చ్చి ఫ‌స్ట్ ఎయిడ్ చేయించారు. ఆ త‌ర్వాత రెవాలోని ప్రైవేట్ హాస్పిట‌ల్‌కు షిఫ్ట్ చేసారు. ఇటీవ‌ల మౌగంజ్‌ను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని 53వ జిల్లాగా ప్ర‌క‌టించారు. (madhya pradesh)