Ram Gopal Varma: ఆ డైలాగ్ ఏదైతే ఉందో…

Hyderabad: రామ్ గోపాల్ వ‌ర్మ (ram gopal varma) ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (jagan mohan reddy) జీవిత నేప‌థ్యంలో వ్యూహం (vyooham teaser) అనే సినిమా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈరోజే టీజ‌ర్ కూడా రిలీజ్ చేసారు. ఇందులో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు, ప‌వన్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, జ‌గ‌న్ భార్య భార‌తి, సోనియా గాంధీ ఇలా కీల‌క‌మైన పాత్ర‌ల‌ను పెట్టి ఇంట్రెస్టింగ్‌గా సినిమా తీసార‌ని టీజ‌ర్‌ను బ‌ట్టి తెలుస్తోంది. టీజ‌ర్ అంతా ఒక్క ఎత్తైతే.. చివ‌ర్లో వ‌చ్చిన డైలాగ్ మ‌రో ఎత్తు. టీజ‌ర్ చూసిన చాలా మంది నెటిజ‌న్స్ లాస్ట్ లైన్ చాలా బాగా కుదిరింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఒక వ్య‌క్తి చంద్ర‌బాబు నాయుడు క్యారెక్ట‌ర్ వేసిన వ్య‌క్తిని.. ఎప్పుడో ఒక‌ప్పుడు మీరు క‌ళ్యాణ్‌ని కూడా వెన్నుపోటు పొడుస్తారుగా? అని అడిగితే.. అందుకు స‌మాధానంగా వాడికి అంత సీన్ లేదు. వాడిని వాడే వెన్నుపోటు పొడుచుకుంటాడు అని చెప్పిన ఒక్క డైలాగ్ టీజ‌ర్‌కి హైలైట్ అని చెప్పాలి. (vyooham teaser)