Mamata Banerjee: ప్ర‌ధాన మంత్రి రేసులో దీదీ..!

West Bengal: లోక్ సభ ఎన్నిక‌లు (lok sabha elections) ద‌గ్గ‌ర‌ప‌డుతున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ (west bengal) అధికారిక పార్టీ TMC శ్రేణులు త‌మ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని (mamata banerjee) ప్ర‌ధానమంత్రిగా చూడాల‌నుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మ‌మ‌తా బెన‌ర్జీ అన్న బ్యాన‌ర్లు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర‌వ్యాప్తంగా వెలిసాయి. సోష‌ల్ మీడియాలో కూడా ప్ర‌ధాని మ‌మ‌తా బెన‌ర్జీ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయాల‌ని పార్టీ కార్య‌కర్త‌లు సోష‌ల్ మీడియా వింగ్‌కి ఆదేశాలు జారీ చేసాయి. 2024లో ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ఎవ‌రికైనా ఉందంటే అది మ‌మ‌తా దీదీకే అని యావ‌త్ వెస్ట్ బెంగాల్ ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇందుకోసం లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 42కి 42 సీట్లు గెలిచి తీరుతామ‌ని చెప్తున్నారు. అపోజిష‌న్ కూట‌మి ఇండియా (india).. NDAను ఓడిస్తే ఇక వెన‌క్కి తిరిగి చూసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నారు.

2024 స్వాతంత్ర్య దినోత్స‌వం (independence day) నాడు ఎర్ర‌కోట‌పై (red fort) ప్ర‌ధానిగా ఓ మ‌హిళ జాతీయ జెండాను ఎగ‌ర‌వేస్తే చూడాల‌ని ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. మ‌మ‌తా బెన‌ర్జీ ఇప్ప‌టివ‌ర‌కు ఏడు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. దీనిపై BJP ఎమ్మెల్యే సువేందు అధికారి (suvendu adhikari) స్పందిస్తూ.. అపోజిష‌న్ కూట‌మిలో ఉన్న వివిధ పార్టీల్లో కూడా సీనియర్లు చాలా మంది ఉన్నార‌ని, మ‌మ‌త ప్ర‌ధాని అవ్వాలనే విష‌యాన్ని వారు ఎలా తీసుకుంటారో చూడాల‌ని ఎద్దేవా చేసారు.