క్షమాపణలు చెప్పిన Upendra
Hyderabad: ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర (upendra) క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఆయన ఫేస్‌బుక్‌లో లైవ్‌కి వచ్చి దళితులపై (dalits) వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. తన రాజకీయ పార్టీ అయిన ప్రజాకీయ పార్టీ (prajakeeya party) యానివర్సరీ సందర్భంగా ఉపేంద్ర ఫేస్‌బుక్ లైవ్ పెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. “” సమాజంలో మార్పు అనేది అమాయక మనసుల నుంచే పుడుతుంది. అమాయక హృదయాలు ఉన్నవారంతా నాతో కలవండి. అలాంటివారు ఇతరులను కించపరిచేలా మాట్లాడరు. చాలా మంది దగ్గర ఎంతో సమయం ఉంటుంది. ఇలాంటివారు నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. అలాంటివారిని మనం ఏమీ చేయలేం. ఉదాహరణకు ఒక పట్టణంలో ఉండే ప్రజల మధ్యలో దళితులు ఎలా ఉంటారో.. అలా అమయక ప్రజల్లోనూ ఇలాంటివారు ఉంటారు. అలాంటివారు చేసే కామెంట్లను పట్టించుకోకండి. ప్రజలకు ప్రేమించడమే నిజమైన దేశభక్తి “” అని అన్నారు. దాంతో దళిత సంఘాలు మండిపడ్డాయి. ఆయనపై ఫిర్యాదులు కూడా చేసాయి. దాంతో ఉపేంద్ర సారీ చెప్పాల్సి వచ్చింది.