Chiranjeevi: లోడింగ్..!

Hyderabad: ఆచార్య (acharya) త‌ర్వాత భోళా శంక‌ర్ (bhola shankar) సినిమాతో మ‌రో ఓట‌మి రుచి చూసారు మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi). వేదాళం (vedalam) సినిమా OTTలో రాలేదంటూ చిరుని బ‌ల‌వంతంగా ఒప్పించి మ‌రీ ఆడియ‌న్స్‌పై ఈ క్రింజ్ సినిమాను వ‌దిలారు మెహ‌ర్ ర‌మేష్‌ (meher ramesh). దాంతో ఇప్పుడు మంచి క‌మ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవ‌స‌రం చిరుకి ఎంతైనా ఉంది. ఇప్పుడు చిరు ద‌గ్గ‌రికి చాలా మంది వ‌స్తున్నారు స్టోరీలు చెప్ప‌డానికి. వారిలో అనిల్ రావిపూడి (anil ravipudi) ఒక‌రు.

అనిల్ రావిపూడి సినిమాలో క్రింజ్ కామెడీ ఉంటుంద‌ని చాలా మంది అంటుంటారు కానీ అయినా కూడా ఆయ‌న సినిమాలు ఎలాగో అలా గ‌ట్టెస్తాయి. ఇప్పుడు అనిల్ చిరుని (chiranjeevi) క‌లిసి జ‌స్ట్ ఒక లైన్ స్టోరీ చెప్పార‌ట‌. ఇప్పుడు చిరు కొంత‌కాలం పాటు బ్రేక్ తీసుకోనున్నారు. ఆయ‌న మోకాలికి స‌ర్జరీ (surgery) ఉంద‌ని నెల రోజుల పాటు రెస్ట్‌లో ఉంటార‌ని అంటున్నారు. అనిల్ చెప్పిన ఆ ఒక్క లైన్ చిరుకి న‌చ్చి ఓకే చెప్తే.. సినిమాను ప్రొడ్యూస్ చేయ‌డానికి దిల్ రాజు (dil raju) రెడీగా ఉన్నారు.