Jailer 2: ఒకేసారి 4 సీక్వెల్స్ ప్ర‌క‌టించిన డైరెక్ట‌ర్

Hyderabad: సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ (rajinikanth) న‌టించిన జైల‌ర్ (jailer) సినిమాకు పార్ట్ 2 (jailer 2) ఉండ‌బోతోంద‌ని క‌న్‌ఫ‌ర్మ్ చేసేసారు డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ (nelson dilip kumar). జైల‌ర్ సినిమాకే కాదు.. ఆయ‌న తీసిన బీస్ట్, కోళ‌మావు కోకిల‌, డాక్ట‌ర్ సినిమాల‌కు కూడా పార్ట్ 2 తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ర‌జినీకాంత్, విజ‌య్‌ను పెట్టి ఒక మ‌ల్టీస్టార‌ర్ తీయాల‌న్న ఆలోచ‌న కూడా ఉన్న‌ట్లు వెల్లడించారు నెల్స‌న్.