Puri Jagannath: సుభ‌ద్ర‌ కోరిన కోరిక ఏంటి?

Hyderabad: ఒడిశా అన‌గానే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చేది పూరీ జ‌గ‌న్నాథుడి (puri jagannath) ఆల‌యం. పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యంలోని గోడ‌ల నిర్మాణానికి మూడు త‌రాల స‌మ‌యం ప‌ట్టింద‌ట‌. 1078లో దీనిని నిర్మించారు. ఏటా నిర్వ‌హించే ర‌థ‌యాత్ర‌లో ల‌క్ష‌లాది మంది భ‌క్తులు పాల్గొంటారు. చార్‌దామ్ యాత్ర‌ల్లో ఒక భాగ‌మైన ఈ జ‌గ‌న్నాథుడి ఆల‌యం గురించి ఈ అద్భ‌త‌మైన విష‌యాలు తెలుసుకుందాం.

ఒక వ‌స్త్రాన్ని ప‌ట్టుకుని నిల‌బ‌డితే గాలి ఎటు నుంచి వ‌స్తే ఆ వ‌స్త్రం అటే ఎగురుతుంద‌న్న విష‌యం చిన్న పిల్ల‌ల‌కీ తెలుసు. కానీ పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యంలో మాత్రం అలా కాదు. ఆల‌య గోపురంపై ఉండే జెండా గాలి ఎటువైపు నుంచి వ‌చ్చినా దానికి అపోజిట్ దిశ‌లో జెండా ఎగురుతుంటుంది. అలా ఎందుకు జ‌రుగుతోందో ఇప్ప‌టివ‌ర‌కు ఏ సైంటిస్ట్ కూడా క‌నిపెట్ట‌లేక‌పోయారట‌. ఆల‌యంలోని గోడ‌లు 45 ఎత్తుల భ‌వ‌నం అంత పొడవుగా ఉంటాయి. ఆల‌య పూజారి ఒక‌రు రోజూ ఈ గోడ‌లు ఎక్కి గోపురం పైన ఉన్న జెండా వ‌స్త్రాన్ని మారుస్తూ ఉండాలట‌. పైగా ఏ స‌హాయం లేకుండా అవ‌లీల‌గా మార్చేస్తుంటారు. ఇలా ఏ ఒక్క రోజు జెండా వ‌స్త్రాన్ని మార్చ‌క‌పోయినా అప‌చారంగా భావించి ఆల‌యాన్ని 18 సంవ‌త్స‌రాల పాటు మూసివేస్తార‌ని అక్క‌డి భ‌క్తుల న‌మ్మ‌కం. (puri jagannath)

సాధారణంగా ఈ భూమ్మీద ఉండే ప్ర‌తిదానికీ నీడ ఉంటుంది. కానీ ఆల‌య క‌ట్ట‌డానికి మాత్రం నీడ‌లేదు. డ్రోన్ ద్వారా ఆల‌యాన్ని ఏ డైరెక్ష‌న్ నుంచి చూసినా ఎండ వ‌ల్ల ఆల‌య నీడ అస‌లు క‌న‌ప‌డ‌ద‌ట‌. ఆల‌యంలో పైన క‌నిపించే సుదర్శ‌న చక్రం బ‌రువు ఒక ట‌న్ను ఉంటుంద‌ట‌. అయితే దానిని ప్ర‌తిష్టించేట‌ప్పుడు ఏ క్రేన్‌ను కానీ భారీ యంత్రాన్ని కాన్నీ ఉప‌యోగించ‌కుండా మ‌నుషులే త‌మ చేతుల‌కు ఉన్న శ‌క్తితో దానిని పైన ప్ర‌తిష్ఠించార‌ని చెప్తుంటారు. ఈ సుద‌ర్శ‌న చ‌క్రాన్ని ఏ వైపు నుంచి చూసినా ఒకేలా క‌నిపిస్తుంద‌ట‌. దైవాన్ని మించింది ఏదీ లేద‌ని అంటారు. అందుకే ఈ ఆల‌యం పై నుంచి ఎలాంటి విమానాలు, హెలికాప్ట‌ర్లు, డ్రోన్లు ఆప‌రేట్ చేయ‌డానికి అనుమ‌తించ‌రు. అంతేకాదు..ఆఖ‌రికి ఓ ప‌క్షిని కూడా ఎగ‌ర‌నివ్వ‌ర‌ట‌. త‌న‌కోసం క‌ట్టించిన ఆల‌యాన్ని క‌నులారా చూసుకునేందుకే ఆ జ‌గ‌న్నాథుడు ఏ ప‌క్షినీ త‌న ఆల‌యం పై నుంచి ఎగ‌ర‌నివ్వ‌డ‌ని చెప్తుంటారు. (puri jagannath)

ఈ ఆల‌యంలో తయారుచేసే ప్ర‌సాదం ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా వృథా కాలేద‌ట‌. ఒక‌రోజు త‌క్కువ ఒక రోజు ఎక్కువ చేసినా అంద‌రికీ స‌రిపోతుంద‌ట‌. జ‌గ‌న్నాథుడి చెల్లెలైన సుభద్ర ఓ కోరిక కోరింద‌ట‌. ఆల‌యంలోకి ప్ర‌వేశించేవారికి ప్ర‌శాంత‌త ఉండాలని ఎలాంటి శ‌బ్దాలు వినిపించ‌కూడ‌ద‌ని కోరింద‌ట‌. ఆమె కోరిక మేర‌కు ఆల‌యంలోకి అడుగుపెట్ట‌గానే ప‌క్క‌నే ఉన్న స‌ముద్రం నుంచి వ‌చ్చే అల‌ల శ‌బ్దం అస్స‌లు వినిపించ‌వ‌ట‌. ఒక్క‌సారి ఆల‌యం నుంచి బ‌య‌ట అడుగుపెట్ట‌గానే మ‌ళ్లీ అల‌ల శ‌బ్దం వినిపిస్తుంద‌ట‌. (puri jagannath)