Varun Lavanya Marriage నవంబర్లోనా?
Hyderabad: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల (varun lavanya marriage) లవ్ స్టోరీ నిజంగా అందరికీ సర్ప్రైజ్ అనే చెప్పాలి. జూన్‌లో పెద్దల అంగీకారంతో వీరి నిశ్చితార్థం గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్లి గురించి చెప్పాలంటే.. నవంబర్‌లో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ ఎంతో ఫేవరెట్ ప్రదేశం అయిన ఇటలీలో వరుణ్, లావణ్యను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు పునాది పడింది కూడా ఇటలీలోనే (italy) అట. అందుకే ఆ ప్లేస్‌ని సెంటిమెంట్‌గా భావిస్తున్నారని టాక్. ఇటలీలోని ఓల్డ్ ప్యాలెస్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. (varun lavanya marriage)
వరుణ్ “లావ్”స్టోరీ
2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో వరుణ్, లావణ్యలు మొదటిసారి కలుసుకున్నారు. షూటింగ్ సమయంలో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. కానీ ఇద్దరూ ఈ విషయాన్ని బయటపెట్టాలనుకోలేదు. ఆ తర్వాత అంతరిక్షం సినిమాలోనూ కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, ఈవెంట్లకు వెళ్లడం వంటివి చేస్తుండేవారు. అప్పుడే వీరు డేటింగ్లో ఉన్నారంటూ మొదటిసారి వార్తలు వచ్చాయి. కానీ ఒక్కరు కూడా స్పందించలేదు. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక (niharika konidela) పెళ్లి రాజస్థాన్‌లో జరిగినప్పుడు కూడా లావణ్య త్రిపాఠి (lavanya tripathi) అందరికంటే ముందే వెళ్లి పెళ్లి పనుల్లో సాయం చేసారు. అప్పుడే వరుణ్, లావణ్యల డేటింగ్ విషయం నిజమేనని కాస్త క్లారిటీ వచ్చింది. గతేడాది డిసెంబర్ 15న వరుణ్ లావణ్యకు పెళ్లి ప్రపోజల్ చేసాడు. ఇదే సంవత్సరంలో వీరి పెళ్లి కూడా జరిగిపోతుందని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ (varun tej) మెగా బ్రదర్ నాగబాబు (nagababu) కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక లావణ్య గురించి చెప్పాలంటే 1990లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించింది. లావణ్య తండ్రి హైకోర్టులో లాయర్. తల్లి టీచర్‌గా చేసి రిటైర్ అయ్యారు. లావణ్యకు అన్న అక్క ఉన్నారు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో అలరించింది. (varun lavanya marriage)