Pushpa The Rule: సెన్సేష‌న‌ల్ రికార్డ్..!

Hyderabad: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) త‌న సినిమాతో మ‌రో సెన్సేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేసారు. ఆయ‌న న‌టిస్తున్న పుష్ప ది రూల్ (pushpa the rule) సినిమా ఫ‌స్ట్ లుక్ కొన్ని నెలల క్రితం రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. చీరక‌ట్టులో ఇప్ప‌టివ‌ర‌కు ఏ టాప్ హీరో వేయ‌ని లుక్‌లో అల్లు అర్జున్ గూస్‌బంప్స్ తెప్పించారు. ఈ ఫ‌స్ట్‌లుక్ ఇప్పుడు సెన్సేష‌న‌ల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియ‌న్ లైక్స్ సాధించిన ఏకైక ఇండియ‌న్ పోస్ట‌ర్‌గా నిలిచింది. ఇది నిజంగా ఆల్ టైం నేష‌న్ వైడ్ రికార్డ్ అనే చెప్పాలి. సుకుమార్ (sukumar) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇది రెండో రికార్డ్ అని చెప్పాలి. పుష్ప ది రూల్ ఆడియో రైట్స్ రూ.40 కోట్ల‌కు పైగా అమ్ముడుపోయి సౌత్ ఇండ‌స్ట్రీలోనే రికార్డ్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. (pushpa the rule)