Tirumala చిన్నారి మృతి ఘటన.. అనుమానాలున్నాయ్..!
Hyderabad: తిరుమల (tirumala) అలిపిరి వద్ద పులి దాడిలో బాలిక మృతిచెందిన ఘటనపై పలు అనుమానాలు ఉన్నాయని అంటున్నారు YSRCP నేత కోవూరు ప్రసన్న కుమార్ (prasanna kumar). బాలిక లక్షిత తల్లితండ్రుల మీద అనుమానం ఉందని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ కేసు విషయమై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసారు.
తిరుమల (tirumala) అలిపిరి కాలి నడక దారిలో లక్షిత అనే చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లక్షితపై ఎలుగుబంటి కానీ పులి కానీ దాడి చేసి చంపినట్లు తెలుస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు. లక్షిత తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి లక్షిత తప్పిపోయింది. ఉదయం చూసేసరికి అలిపిరి నడక దారిలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి శవమై కనిపించింది.
చిన్నారి మృతదేహాన్ని బట్టి చూస్తే ఎలుగుబంటి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసినట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. పాప ఒంటరిగా వెళ్తున్న సమయంలో పాపను ఎలుగుబంటి ఎత్తుకెళ్లినట్టుగా తిరుమల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. మెట్ల మార్గంలో కాకుండా పక్కకు వెళ్లడం వల్ల ఈ దారుణం చోటుచేసుకుందని తెలిపారు. బిడ్డ చనిపోవడంతో లక్షిత తల్లి కన్నీరుమున్నీరవుతున్నారు. (tirumala)