Chiranjeevi: ఇది బాసూ మీ అస‌లు రూపం..!

Hyderabad: మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ త‌న స‌త్తా చాటుకున్నారు. ఖైదీ నెం.150తో ఆయ‌న సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యాక‌.. సైరా న‌ర‌సింహారెడ్డితో ఎక్స్‌ప‌రిమెంట్ చేసారు. సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉన్నా..ఆరు ప‌దుల వ‌య‌సులోనూ బాస్ గ్రేస్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న రీఎంట్రీ ఇచ్చాక మొత్తం ఆరు సినిమాల్లో న‌టించారు. ఈ ఆరు సినిమాలు మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ బాగానే ఉన్నాయి. కానీ మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన భోళా శంక‌ర్ (bhola shankar) సినిమా ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ మాత్రం బాస్ త‌న‌ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు చూసి ఉండరు.

రీఎంట్రీ త‌ర్వాత చిరంజీవి న‌టించిన ఐదు సినిమాల గ్రాస్ క‌లెక్ష‌న్లు చూస్తే..

ఖైదీ నెం 150 – 51 కోట్లు

సైరా న‌ర‌సింహా రెడ్డి – 83 కోట్లు

ఆచార్య – 53 కోట్లు

గాడ్ ఫాద‌ర్ – 32 కోట్లు

వాల్తేరు వీర‌య్య – 49 కోట్లు

భోళా శంక‌ర్- 29 కోట్లు

దీనిని బ‌ట్టి చూస్తే ఆయ‌న రీఎంట్రీ త‌ర్వాత చేసిన సినిమాల్లో లీస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమా భోళా శంక‌ర్. మెహ‌ర్ ర‌మేష్ ప‌దేళ్ల గ్యాప్ తీసుకుని వేదాళం రీమేక్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. రీమేక్ ఎందుకు స‌ర్ అని అడిగితే.. త‌ప్పేముంది.. వేదాళం ఏ ఓటీటీలో రిలీజ్ అవ్వ‌లేదు క‌దా అంటే ఎవ్వ‌రూ చూసి ఉండ‌రు అని లాజిక్ లేకుండా మాట్లాడారు. ఓటీటీలో రాక‌పోతే ఏంటి? అది ఆల్రెడీ యూట్యూబ్‌లో వ‌చ్చేసింది. ఇక‌నైనా చిరంజీవి ఇలాంటి రీమేక్‌ల‌లో కాకుండా చిన్న డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలు ఇచ్చి మంచి క‌థ‌తో సినిమాలు తీస్తే ఫ్యాన్స్ మ‌రింత ఖుష్ అవుతారు. (chiranjeevi)