పవర్​స్టార్​ ఫ్యాన్స్​కి అదిరిపోయే న్యూస్​!

పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ కెరీర్​ ప్రారంభం నుంచీ సంవత్సరానికి ఒకటీ, రెండు సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చారు. అయితే ఈ మధ్య కాస్త స్పీడ్​ పెంచిన పవన్​ కల్యాణ్​ వరుస సినిమాలకు సంతకం చేస్తూ ఫ్యాన్స్​ని సర్​ప్రైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవన్​ కల్యాణ్​ సంతకం చేసిన నాలుగు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ​క్రిష్​ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు, సముద్ర ఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయా సీతం రీమేక్​ ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే ఉస్తాద్​ భగత్​సింగ్​ కూడా సెట్స్​పైకి వెళ్లనుందని తెలుస్తోంది. పవన్​ కల్యాణ్​కి గబ్బర్​సింగ్​ లాంటి బ్లాక్​బస్టర్​ హిట్​ ఇచ్చిన హరీష్​ శంకర్​ దర్వకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరస హిట్లు అందుకున్న పవర్ స్టార్, ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరాడిక్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు పవన్​. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తవకుండానే పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇటీవలె హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ సినిమాలు లాంచనంగా మొదలు పెట్టారు పవన్. అయితే ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన వినోదయ సీతమ్‌ రీమేక్​ ఇప్పుడు సెట్స్ పైకి వెళితే ఉస్తాద్ భగత్‌సింగ్, సాహో సినిమా దర్శకుడు సుజిత్ రూపొందించనున్న ఓజి పరిస్థితేంటనే టాక్ నడుస్తోంది. కానీ త్వరలోనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట.

తాజాగా షూటింగ్ షెడ్యూలు ప్లానింగ్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నహరీష్ శంకర్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను కూడా ఫైనల్‌ చేసినట్టు టాక్. వినోదయా సీతంలో పవన్​ షెడ్యూల్​ పూర్తవగానే ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత సుజీత్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మొదలు పెడతారని టాక్​. వీటితో పాటు హరిహర వీరమల్లు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమాలను కంప్లీట్ చేయడమే పవన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ సాధించింది. బండ్ల గణేష్ నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  నటన, డైలాగ్స్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఊహించని విజయాన్ని అందుకున్న గబ్బర్​సింగ్​ నిజంగా పవన్​ కెరీర్​లో మైలురాయిగా నిలిచిందనే చెప్పాలి. వరుస అపజయాలతో సతమతమైన పవన్​ గబ్బర్​సింగ్​తో ట్రెండ్​ క్రియేట్​ చేశారు. అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్ మళ్లీ హరీష్ తో ఎప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడు అని వేచి ఉండగా అది ఇప్పటికి కుదిరింది. ఇక భవదీయుడు భగత్​సింగ్​ నుంచి ఉస్తాద్​ భగత్​సింగ్​గా టైటిల్​ మార్చుకున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి ఉండక తప్పదు!