Prabhas: స‌ర్జ‌రీ చేయించుకోనున్న ప్ర‌భాస్

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ (prabhas) త్వ‌ర‌లో మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకోనున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌లార్ (salaar), క‌ల్కి (kalki) సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల షెడ్యూల్స్ అయిపోయాక స‌ర్జ‌రీ చేయించుకుంటార‌ట‌. బాహుబ‌లి (baahubali) షూటింగ్ టైంలో ప్ర‌భాస్ మోకాలికి దెబ్బ తగిలింది. ఆ త‌ర్వాత ఆయ‌న మోకాలికి స‌ర్జ‌రీ చేయించుకున్నారు. అయినా కూడా లోప‌ల ఇంకా గాయం త‌గ్గ‌లేద‌ట‌. దాంతో మ‌రోసారి స‌ర్జ‌రీ చేయాల‌ని డాక్ట‌ర్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. (prabhas surgery)