Jayaprada: జయప్రదకి 6 నెలల జైలు శిక్ష
Chennai: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు (jayaprada) 6 నెలల జైలు శిక్ష పడింది. చెన్నైలోని ఎగ్మోర్ కోర్టు (egmore court) ఈరోజు తీర్పు వెల్లడించింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు ఓ సినిమా థియేటర్ ఉంది. దీనిని రామ్ కుమార్, రాజ బాబు అనే వ్యక్తులు చూసుకుంటున్నారు. అయితే కొంతకాలంగా జయప్రద ఉద్యోగులకు ఈఎస్ఐ (ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్) చెల్లించడంలేదని వారు ఎగ్మోర్ కోర్టులో పిటిషన్ వేసారు. అయితే మొత్తం ను చెల్లించేస్తానని, తనపై వేసిన కేసును కొట్టివేయాలని జయప్రద న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు పిటిషన్ వేసినవారు ఒప్పుకోలేదు. దాంతో వాదోపవాదాలు విన్న న్యాయస్థానం జయప్రదతో (jayaprada) పాటు మరో ముగ్గురికి 6 నెలల జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించింది.